13-02-2026 01:41:44 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): ఉపాధి హామీ కూలి పనులకు వెళ్లిన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన పగిడోజు రంగయ్య(66) శుక్రవారం ఆకస్మికంగా నొప్పితో గుండెపోటుతో మృతి చెందారు. రోజు మాదిరిగానే గ్రామ సమీపంలోని గుట్ట పక్కన కెనాల్ దగ్గర ఉపాధి హామీ పనులు చేస్తుండగా రంగయ్య గుండె నొప్పితో కింద పడిపోయాడు. అప్రమత్తమైన తోటి కూలీలు సిపిఆర్ చేసిన అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య,ముగ్గురు కుమారులు ఉన్నారు. ప్రభుత్వ అధికారుల స్పందించి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు కుటుంబ సభ్యులు కోరారు. దీనితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.