16 May, 2026 | 5:12 PM

మంథని మున్సిపల్ ప్రధాన రహదారి పక్కన ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్

16-05-2026 04:28 PM

పట్టించుకోని మున్సిపల్ పాలకవర్గం, విద్యుత్ శాఖ అధికారులు

ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ప్రయాణిస్తున్న మంథని ప్రజలు

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణంలోని మున్సిపల్ ప్రధాన రహదారి పక్కన ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్నప్పటికీ ఇటు మున్సిపల్ పాలకవర్గం,  విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో మంథని పట్టణంలోని ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. అసలే పట్టణంలో ఇరుకు రోడ్లతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు, ఈ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను రోడ్డు మీదనే ఏర్పాటు చేయడంతో ద్విచక్ర వాహన దారులు, కార్లలో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

అయినప్పటికీ ప్రతిరోజు ఈ ట్రాన్స్ఫర్ మీదుగా ప్రయాణించే మున్సిపల్ పాలకవర్గం, విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు అంటే మున్సిపల్ పాలకవర్గం, విద్యుత్ శాఖ అధికారులకు పట్టింపు లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ ను తరలించి మరోచోట ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.‌