13 July, 2026 | 9:28 PM

Breaking News

పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •   ఆల్బెండజోల్ మాత్రాల పంపిణి   •   ఇబ్రహీంపేట్ లో వర్షాలు కురవాలని బసవేశ్వర ఆలయంలో జలాభిషేకం   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యువజన వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి   •  

విద్యుత్ శాఖ ప్రజాబాట

06-01-2026 07:27 PM

మంచరామిలో సమస్యల గుర్తింపు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): విద్యుత్ శాఖ  ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచరామి గ్రామంలో పర్యటించిన  అధికారులు గ్రామంలో ఉన్న వివిధ సమస్యలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉప్పు లక్ష్మీ, ఉప సర్పంచ్ ఎగుర్ల శ్రీనివాస్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి రాజేష్ కుమార్ పాల్గొన్నారు.  అలాగే ఏఈ దామోదర్ , లైన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, లైన్మెన్ కుమారస్వామి, జూనియర్ లైన్మెన్లు తదితర విద్యుత్ సిబ్బంది పాల్గొని గ్రామంలో పర్యటించారు.

గ్రామంలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలను గుర్తించిన అధికారులు, వాటిని గ్రామ పాలకవర్గ సహకారంతో త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ ప్రజా బాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల గ్రామంలోనూ విద్యుత్ శాఖ వారు ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించారు.