6 June, 2026 | 5:27 PM

మంథని టీజీఎస్‌ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక

06-06-2026 03:56 PM

మంథని,(విజయక్రాంతి): టీజీఎస్‌ఆర్టీసీ మంథని డిపో తెలంగాణ మజ్దూర్ యూనియన్  టీఎంయూ నూతన కమిటీని శనివారం ఘనంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రకటించారు.

ఎన్నికైన నూతన కార్యవర్గం

 ముఖ్య సలహాదారుగా వి. ఐలయ్య (ఏడీసీ) చైర్మన్గ గా ఏ. రమేష్, అధ్యక్షులుగా ఎస్. శేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా బి. జనార్ధన్, ప్రధాన కార్యదర్శిగా కె.కె. రెడ్డి, చీఫ్ వైస్ ప్రెసిడెంట్  కె.ఆర్. రావు, జాయింట్ సెక్రటరీగా ఎండీ. మునీర్, కోశాధికారిగా బి. తిరుపతి వీరితో పాటు గ్యారేజ్ విభాగం ప్రధాన కార్యదర్శిగా జి. కృష్ణ, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా ఎండీ. ఇంతియాజ్ బేగం, వైస్ ప్రెసిడెంట్‌గా ఏ. గోపి, సహాయ కార్యదర్శిగా ఎస్. రాజయ్య తదితరులతో కూడిన మొత్తం 40 మంది సభ్యుల కార్యవర్గాన్ని నియమించారు.

జిల్లా కమిటీలో మంథని డిపో ప్రతినిధులు

కరీంనగర్ విజయ్ జిల్లా కమిటీలో కూడా మంథని డిపోకు చెందిన పలువురు సభ్యులు కీలక బాధ్యతలు చేపట్టారు. ఇందులో వి. ఐలయ్య (చీఫ్ వైస్ ప్రెసిడెంట్), సదానందం (వైస్ ప్రెసిడెంట్), ఎస్. సదయ్య (అసిస్టెంట్ సెక్రటరీ), వి. ఏసుమని (మహిళా అసిస్టెంట్ సెక్రటరీ) నియమితులయ్యారు.

అభినందనలు తెలిపిన డిపో మేనేజర్

ఎన్నిక అనంతరం కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులను రీజినల్ కమిటీ సభ్యుల సమక్షంలో డిపో మేనేజర్ కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన బాధ్యులను డీఎం ప్రత్యేకంగా అభినందించారు. కార్మికుల సంక్షేమం కోసం, సంస్థ అభివృద్ధి కోసం నూతన కమిటీ సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు.