బాలిస్టిక్ క్షిపణి విజయవంతంపై హర్షం
డీఆర్డీవో శాస్త్రవేత్తలకు రాంచందర్ రావు అభినందనలు
హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో భారత్ రక్షణ రంగం మరింత బలపడుతోందని, డీఆర్డీవో అభివృద్ధి చేసిన బహుళ-స్థాయి బా లిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ విజయవంతమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు శనివారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
మధ్య శ్రేణి నౌకాదళ యాంటీ- క్షిపణి కూడా విజయవంతంగా పరీక్షించబడిందన్నారు. ఈ విజయాలు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి మరో గొప్ప మైలురాయిగా నిలిచాయని, దేశ భద్రతను మరింత బలోపేతం చేసే కీలక అడుగులుగా అభివర్ణించారు. ఆధునిక క్షిపణి రక్షణ సామర్థ్యాలు కలిగిన కొద్ది దేశాల సరసన భారత్ నిలిచిందని, ఈ చారిత్రాత్మక విజయానికి కృషి చేసిన డీఆర్డీవో శాస్త్రవేత్తలు, సిబ్బందికి రాంచం దర్‌రావు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.






