18 May, 2026 | 1:13 AM

దేశాభివృద్ధికి విద్యాలయాలే దీపం

18-05-2026 12:14 AM

ఎంజియూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్

నల్లగొండ టౌన్, మే 17: దేశాభివృద్ధికి విద్యాలయాలే దీపమని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ప్రజా పాలనప్రగతి ప్రణాళిక లో భాగంగా యూనివర్సిటీలో నిర్వహించిన విద్యా వారోత్సవాల ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్య ద్వారానే వ్యక్తి, కుటుంబం, సమాజం రూపాంతరం చెందుతుందని, గ్రామీణ ప్రాంతాల సాధారణ విద్యార్థికి కూడా నాణ్యమైన ఉన్నత విద్య అందే విధంగా సంస్థాగత ప్రణాళికలను అమలు చేస్తున్నామన్నారు.

విశ్వవిద్యాలయంలో స్వల్ప, దీర్ఘకాల ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్లాన్ ద్వారా కొత్త కళాశాలలు, హాస్టళ్లు, అకాడమిక్ బ్లాకులు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఆరోగ్య కేంద్రాలు, లైబ్రరీ ఇంజినీరింగ్ విభాగ విస్తరణ వంటి పలు మౌలిక వసతుల అభివృద్ధి పనులను దశలవారీగా అమలు చేస్తున్నట్టు వివరించారు. బోధనలో ఔట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ , నూతన పాఠ్య విధానాలు, రిమీడియల్ టీచింగ్, మెంటరింగ్ సిస్టమ్, పరిశోధనోత్సాహం, నాణ్యమైన విద్యార్థి ప్రాజెక్టులు, డాక్టరల్ రీసెర్చ్ మెరుగుదలకు ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని, నాన్-టీచింగ్ సిబ్బంది పారదర్శక పరిపాలన, రికార్డు నిర్వహణ, విద్యార్థి సేవల బలోపేతంలో కేంద్రీయ భాగస్వాములని పేర్కొన్నారు.

తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మీడియా వంటి స్టేక్ హోల్డర్లతో సమన్వయాన్ని బలోపేతం చేసి, గ్రామీణ, వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యా ఫలాలను సద్వినియోగం చేసుకునేలా విశ్వవిద్యాలయం సంకల్పతో ముందుకు సాగుతోందనీ తెలిపారు ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి స్పోరట్స్ బోర్డ్ డైరెక్టర్ డా హరీష్ కుమార్, డా శ్రీనివాసరెడ్డి, ఎస్ ఓ బేగ్, శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.