3 June, 2026 | 5:07 AM

డ్రైనేజీ పనులు పూర్తి చేయాలి

03-06-2026 01:42 AM

బీఎన్ రెడ్డి డివిజన్ మాజీ కార్పొరేటర్ లచ్చిరెడ్డి 

ఎల్బీనగర్, జూన్ 2 : గుర్రంగూడ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఉన్న బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లో డ్రైనేజీ పనులు పూర్తి చేసి, ఉద్యానవనం పనులు చేపట్టాలని అధికారులను మాజీ కార్పొరేటర్ లచ్చిరెడ్డి కోరారు. మంగళవారం గుర్రంగూడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో సమన్వయ సమావేశం నిర్వహించారు.

సమావేశానికి ఫారెస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ బాబ్జీరావ్, ఎంఎంసీ హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ స్వామి, జలమండలి సీజీఎం నాగేందర్, బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, గుర్రంగూడ మాజీ కౌన్సిలర్ లక్ష్మారెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్, డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కస్నా నాయక్, జలమండలి మేనేజర్ సిరివెన్నెల, భవ్యారెడ్డి, భానుప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ... బీఎన్ రెడ్డి నగర్ కాలనీ, హరిహర పురం కాలనీ, గాంధీనగర్ పొడువునా విస్తరించి ఉన్న ఫారెస్ట్ ను అతి త్వరలోనే ఉద్యాన వనంగా మారుస్తున్నారని తెలిపారు. ఉద్యానవనం పనులకు ముందుగా సాగర్ కాంప్లెక్స్, శ్రీపురం కాలనీలో వైపు నుంచి వచ్చే డ్రైనేజీ, స్టోర్మ్ వాటర్ తో హరిహర పురం కాలనీ, గాంధీనగర్, గ్రీన్ సిటీ కాలనీ, అఖిలాండేశ్వరి కాలనీ, పీవీఆర్ కాలనీ, మైల్ స్టోన్ కాలనీలకు ఇబ్బంది కలగకుండా 600 ఎంఎం డయా పైప్ లైన్ నిర్మాణం చేయాలని కోరారు.

ఈ పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. పనులు ప్రారంభించే ముందు ఫారెస్ట్ కు ఆనుకొని ఉన్న అన్ని కాలనీల సంక్షేమ సంఘం సభ్యులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వివిధ కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు కొన్ని సూచనలు చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని అధికారులను కోరారు.