29 March, 2026 | 4:26 AM

స్నేహిత హిల్స్‌లో డ్రైనేజీకి మరమ్మతు

29-03-2026 12:48 AM

రాజేంద్రనగర్ మార్చి, 28 (విజయక్రాంతి) : జిహెచ్‌ఎంసి రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని స్నేహిత హిల్స్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కి అధికారులు మరమ్మత్తు చేశారు. గత ఆరు నెలల నుండి స్నేహితహిల్స్‌లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ ముందు రోడ్డుపై ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో చెత్త పేరుకు పోవడంతో మురుగు నీరు రోడ్డు పైకి వచ్చి దుర్వాసన వెదజల్లడంతో పాటు మురికిగుంటగా తయారు అయి రోడ్డు ప్రయాణానికి ఇబ్బందులు అయ్యాయి.

ఈ సమస్య పై శుక్రవారం ‘జయ క్రాంతి దినపత్రికలో’ ‘సిఎం ఆదేశాలకు దిక్కెవరు.. రోడ్ల పైనే మురుగు నీరు పరుగు‘ అనే శీర్షికన వార్త ప్రచురితం కావడంతో రాజేంద్ర నగర్ ఎస్ ఈ నరేందర్ గౌడ్ డీ ఈ యాదయ్య ఎ ఈ నాగి రెడ్డి ఆదేశాలమేరకు శనివారం ఇంజనీరింగ్ సెక్షన్ వర్క్ ఇన్స్పెక్టర్ జె సి బి సహాయంతో డ్రైనేజీ కి మరమ్మత్తు చేయించారు .సమస్య పరిష్కారం కావడం తో స్నేహిత హిల్స్ కాలనీ వాసులు విజయ క్రాంతికి కృతజ్ఞతలు తెలిపారు..