12 May, 2026 | 10:56 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

వర్షాకాలంలో సమస్యలు రానివ్వొద్దు

12-05-2026 12:00 AM

రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి 

రాజేంద్రనగర్, మే 11 (విజయక్రాంతి): వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తం గా ఉండాలని రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. సోమవా రం రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని రాజేంద్రనగర్, అత్తాపూర్, చాంద్రాయణగుట్ట, జం గంమెట్,  ఫలుకునుమ, బహుదూర్ పుర సర్కిళ్లలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సర్కిల్ కా ర్యాలయంలో జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో సమీక్ష సమా వేశం నిర్వహించారు.

హైడ్రా గుర్తించిన  వర్షాకాలంలో నీరు నిలచి ఉండే 30 ప్రాం తాల్లో ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోవాల న్నారు. అత్తాపూర్ సర్కిల్ లలో నీరు నిలిచే ప్రాంతాలు 15 ఉన్నాయని, మిగతా సర్కిళ్లలో 15 పాయింట్లు ఉన్నాయని తెలిపారు. సమావేశంలో హైడ్రా రాజేంద్రనగర్ జోనల్ ఇన్‌చార్జి మహేష్, జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్ జోన్ ఇన్‌చార్జి ఎస్‌ఈ నరేందర్‌గౌడ్, ఈఈలు వెంకట శేషయ్య పాల్గొన్నారు.