12 May, 2026 | 8:49 PM

Breaking News

హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •  

ఇరాన్‌‌తో యుద్ధానికి బ్రేక్.. ట్రంప్ సంచలన ప్రకటన

23-03-2026 05:40 PM

వాషింగ్టన్: ఇరాన్ తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) కీలక ప్రకటన చేశారు. ఇరాన్ పవర్ ప్లాంట్ లు, ఇంధన క్షేత్రాలపై ఐదు రోజుల వరకు దాడులు చేయమని వెల్లడించారు. రెండు రోజులుగా ఇరాన్ తో  చర్చలు జరుపుతున్నామని వివరించారు. మరో వారం పాటు ఇరాన్ తో చర్చలు జరగవచ్చని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో సమస్యలను పరిష్కారించే దిశగా చర్చలు జరుపుతున్నాయి వెల్లడించారు. చర్చల ఫలితంపై భవిష్యత్ కార్యాచరణ ఉటుందని తెలిపారు. పశ్చిమాసియాలో శాంతి కోసం కృషిచేస్తానని ట్రంప్ తెలిపారు.

 పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్ సంక్షోభం నెలకొంది. పలు దేశాల్లో పెట్రోల్ ధరలు పెరిగాయి. భారత్ లో కూడా ఎల్పీజీ కోతరతో గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరపడ నిల్వలున్నాయని చెప్పుకొస్తున్నారు.  నేడు లోక్ సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ  పశ్చిమాసియా యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడా సమస్య వచ్చిన దాని ప్రభావం భారత్ పై పడుతోందని తెలిపారు.