22 April, 2026 | 3:28 AM

9 నెలల శిశువుకు కిమ్స్ కడల్స్ వైద్యులు ప్రాణదానం

22-04-2026 12:04 AM
  1. ఛత్తీస్‌గఢ్ నుంచి హైదరాబాద్‌కు ఎయిర్ లిఫ్ట్
  2. తీవ్రమైన శ్వాస సమస్యలతో బాధపడుతున్న చిన్నారి 
  3.   45 రోజుల పాటు చికిత్స- అందించిన కిమ్స్ కడల్స్ కొండాపూర్ వైద్యులు

హైదరాబాద్, ఏప్రిల్ 21(విజయక్రాంతి): తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలతో బా ధపడుతున్న తొమ్మిది నెలల శిశువు ప్రాణాలను రాష్ట్రాలు దాటి ఎయిర్ లిఫ్ట్ చేసి నెల రోజులకుపైగా చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు కిమ్స్ కడల్స్ కొండాపూర్ వైద్యు లు. ఇందుకు సంబంధించిన వివరాలను చికిత్సనందించిన పీడియాట్రిక్స్ క్లినికల్ డైరెక్టర్ అండ్ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ హెడ్, డాక్టర్ పరాగ్ డెకాటే తెలిపారు.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయపూర్ ప్రాంతా నికి చెందిన తొమ్మిది నెలల శిశువు మొదట జలుబు, దగ్గుతో ఆస్పత్రిలో చేరిన శిశువు ఆరోగ్యం వారం రోజుల్లోనే తీవ్రంగా క్షీణించింది. వెంటిలేటర్‌పై ఉంచినప్పటికీ ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో పరిస్థితి మరింత విషమించింది. తీవ్రమైన అడెనో వైరస్ కారణంగా వచ్చే తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫె క్షన్ (అడెనోవైరల్ న్యూమోని యా), శ్వాసకోశ వైఫల్యం ఏర్పడింది.పరిస్థితి అత్యవస రంగా మారడంతో కిమ్స్ కడల్స్ నియోనేటల్, పీడియాట్రిక్ ట్రాన్స్‌పోర్ట్ బృందం రాయపూర్కు చేరుకుంది.

అక్కడ శిశువును చికిత్సను అందించి వెంటిలేటర్‌పై ఉంచి వి మాన బృందాల సమన్వయంతో సురక్షితం గా హైదరాబాద్‌కు ఎయిర్ లిఫ్ట్ చేశాం. కి మ్స్ కడల్స్ కొండాపూర్‌లో పీడియాట్రిక్ ఐ సీయూ చేర్చిన అనంతరం శిశువుకు తీవ్రమై న ఎఆర్డీఎస్‌తో పాటు న్యూమోథొరాక్స్ (ఊపిరితిత్తుల చుట్టూ గాలి చేరడం) ఉన్నట్లు గుర్తించారు. హెచ్‌ఎఫ్‌ఓవీ, (ఇన్హేల్ నైట్రిక్ ఆక్సైడ్ వంటి చికిత్సలు చేసినప్పటికీ శ్వాస లో మెరుగుదల కనిపించలేదు.

దీంతో పరిస్థితి విషమంగా మారడంతో కార్డియోథొరా సిక్ శస్త్రచికిత్స, పీడియాట్రిక్ ఐసీ యూ బృందాలు కలిసి వీఏ ఎక్మో చికిత్స ప్రారంభించాం. ఈ యంత్రం గుండె, ఊపిరితిత్తుల పనిని తాత్కాలికంగా నిర్వహిస్తూ శరీరానికి ఆక్సిజన్ అందించడంతో పాటు కార్బన్ డయాక్సైడ్‌ను తొలగిస్తుంది.శిశువు 25 రోజులపాటు ఎక్మోపై ఉండగా, వైద్య బృందం అనేక సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంది.

అధిక వైరల్ లోడ్, ఇతర ఇన్ఫెక్షన్లు, గాలి లీకులు, రక్తస్రావం, రక్తపోటు మార్పు లు వంటి సమస్యలను విజయవంతంగా చికిత్సను అందించాం.తదుపరి శిశువు ఆరో గ్యం క్రమంగా మెరుగుపడడంతో ఎక్మో, వెంటిలేటర్ నుంచి విజయవంతంగా తొలగించాం. మొత్తం 45 రోజుల చికిత్స అనం తరం శిశువును పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ చేశారు.ఈ విజయవంతమైన చికిత్సలో పీడియాట్రిక్ ఐసీయూ వైద్యులు డాక్టర్ కళ్యాణ్ కె, డాక్టర్ అవినాష్ రెడ్డి పి, డాక్టర్ వినోద్ కు మార్, డాక్టర్ మాధురి కె కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ సందీప్; ఇన్ఫెక్షియస్ డిసీజ్ నిపుణుడు డాక్టర్ రవి తేజ పాల్గొన్నారు.

  సమయానికి సరైన చికిత్స అందడం ఎంత ముఖ్యమో ఈ కేసు నిరూపించింది. ఎక్మో వంటి ఆధునిక ‘రెస్క్యూ థెరపీలు’ అందుబాటులో ఉండటం ప్రాణాలను కాపాడటంలో కీలకం. వెంటిలేటర్‌పై ఉన్న శిశువును ఎయిర్‌లిఫ్ట్ చేసి, దీర్ఘకాలం ఈసీఎంఓపై నిర్వహిం చడం అనేది నైపుణ్యం కలిగిన వైద్య బృం దం వల్లే సాధ్యమైంది అని డాక్టర్ పరాగ్ తెలిపారు.