3 June, 2026 | 5:35 PM

కర్నాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణస్వీకారం

03-06-2026 04:31 PM

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్(DK Shivakumar Sworn) బుధవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. డీకే శివకుమార్ తో కర్నాటక గవర్నర్ లోక్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. డీకేతో పాటు మరో 14 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. డీకే శివకుమార్(Karnataka CM) రాజ్యంగం పట్టుకుని ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ పెద్దల ఆదేశంతో సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి డీకే ఇచ్చిన విషయం తెలిసిందే.

డీకే శివకుమార్ రాజకీయ ప్రస్థానం 

డీకే శివకుమార్ మే 15 1962లో జన్మించారు. 27 ఏళ్ల వయసులో 1989లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు డీకే ఎనిమిది సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మూడున్నర దశాబ్దాలుగా ఓటిమి ఎరుగని ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు. ఉప ముఖ్యమంత్రి సహా పలు కీలకమంత్రి పదవులు చేపట్టారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి వీర విధేయుడైన డీకే కర్నాటకలోని ఒక్కలిగ సామాజికవర్గంలో కీలక నేతగా ఉన్నారు. రాజనీతి శాస్త్రంలో శివకుమార్ మాస్టర్స్ డిగ్రీ చేశారు. విద్య, రియల్ ఎస్టేట్, ఆతిథ్యరంగాల్లో వ్యాపారాలున్నాయి.

సంపన్న రాజకీయ నేతల్లో డీకే ఒకరిగా గుర్తింపు సాధించారు. 1980లో విద్యార్థి నేతగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 2008లో కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు. 2020 నుంచి కేపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. సంక్షోభాల సమయాల్లో డీకే ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందారు. రాజకీయ జీవితంపై తరచూ వివాదాల నీడలుండేవి. 2019లో మనీలాండరింగ్ ఆరోపణలపై డీకే అరెస్ట్ అయ్యారు. తీహాడ్ జైల్లో 50 రోజులకు పైగా శివకుమార్ శిక్ష అనుభవించారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో శివకుమార్ కీలక పాత్ర పోషించారు.