చిమిర్యాల రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయ కిట్లు పంపిణీ
కోదాడ, మార్చి 17 : మండలంలోని చిమిర్యాల క్లస్టర్ రైతు వేదిక లో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ లో భాగంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 125 మంది రైతులకు మంగళవారం ప్రకృతి వ్యవసాయ కిట్లు, సాయిల్ హెల్త్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. సహాయ వ్యవసాయ సంచాలకు లు పి ప్రశాంతి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ద్వారా రైతులను ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా ప్రోత్సహిస్తుందని రైతులందరూ కూడా సహజ వ్యవసాయ పద్ధతులు పాటించి వ్యవసాయం చేయాలని తెలిపారు.
మండల వ్యవసాయ అధికారి పి రజనీ మాట్లాడుతూ సాయిల్ హెల్త్ కార్డుల వల్ల భూమిలో ఎంత మేర పోషకాలు ఉన్నాయో తెలుసుకొని దాని ద్వారా మిగతా ఎరువులను సరైన మోతాదులో వాడడానికి అవకాశం ఉంటుందని తెలిపారు, ఈ కార్యక్రమంలో చిమిర్యాల గ్రామ సర్పంచ్ గురవయ్య, నల్లబండ గూడెం సర్పంచ్ అల్సకని భవానీ సరబెశ్వర రావు, మంగలితండ సర్పంచ్ ధరావత్ బాబ్జీ,వ్యవసాయ విస్తరణ అధికారి మహేష్, సల్మా, రైతులు పాల్గొన్నారు.




