calender_icon.png 20 February, 2026 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్చిలో డబల్ బెడ్ రూముల పంపిణీ

20-02-2026 02:11:59 AM

షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రకటన 

షాద్‌నగర్, ఫిబ్రవరి 19(విజయక్రాంతి): డబుల్ బెడ్ రూమ్ లను మార్చి మొదటి వారం కల్లా లబ్ధిదారులకు  అందజేస్తామని,ఈలోపే ఇక్కడ అసంపూర్తి పనులను వెంటనే పూర్తిచేయాలని  షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధికారులని  ఆదేశించారు. షాద్‌నగర్ పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ లని  ఆయన గురువారం  పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు మార్చి మొదటి వారంలో ఎట్టి పరిస్థితుల్లో లబ్ధిదారులకు పంపిణీ జరుగుతుందని, ఈలోపు కచ్చితంగా పనులు పూర్తి చేయాలని ఆర్ అండ్ బి, మున్సిపాలిటీ, విద్యుత్ శాఖ అధికారులకు  అయన సూచించారు. నిర్మాణం పూర్తయినప్పటికీ ఇక్కడ కాలువల వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, చాలా ఇండ్లు తలుపులు, కిటికీలు ఊడిపోయి శిథిలావస్థకు చేరడం,

తాగునీటి వ్యవస్థ లేకపోవడం తదితర సమస్యలను అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాది పరిశీలించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఇక్కడ సదుపాయాల కల్పన కోసం నిధులు మంజూరు చేశారు. గత ఏడాది నుంచి పనులు కొనసాగుతున్నాయి. గత ఏడాది చివరలో ఇక్కడ తాగునీటి వ్యవస్థను కూడా ఎమ్మెల్యే స్వయంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఆ పనులన్నీ చివరి దశలో ఉన్నాయి. ఎమ్మెల్యే తో పాటు షాద్నగర మునిసిపాలిటీ  చైర్మన్ అగునూరు బస్వం, వైస్ చైర్మన్ అందేమోహన్ తదితరులు ఉన్నారు.