రైతులకు నీళ్లు ఇవ్వాలన్న జ్ఞానం మంత్రులకు ఉండాలి కదా?
మంత్రుల మాట, వరంగల్ కలెర్టర్ ది మరో మాట ఉంటుందా?
నీళ్లు ఉన్న కలెక్టర్.. ఇవ్వబోమని ఎలా చెబుతారు?
రైతులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి!
హైదరాబాద్: రేవంత్ రెడ్డి సర్కార్ రైతులను ఇబ్బంది పెడుతోందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు(Harish Rao) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల మాటలు నమ్మి నాట్లు వేసుకున్న రైతుల పరిస్థితి ఏంటి?, మంత్రుల మాట, వరంగల్ కలెక్టర్ ది మరో మాట ఉంటుందా?, నీళ్లు ఉండగా కలెక్టర్ నీళ్లు ఇవ్వబోమని ఎలా చెబుతారు?, వారం వ్యవధిలో కలెక్టర్ ది ఒక మాట, మంత్రులది మరో మాట ఉండవచ్చా?, రామప్ప కింద తూములు మూసివేశారు.. నాట్లు వేసిన రైతుల పరిస్థితి ఏంటి?, అని తెలంగాణ భవన్(Telangana Bhavan)లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ రావు వరుస ప్రశ్నలు సంధించారు.
గోదావరిలో నీళ్లు ఉండగా తూములు ఎందుకు మూసివేశారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో మోటార్లు మరమ్మతు చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. పది మోటార్లు నడపలేకపోతున్నామని రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బోర్లు ఎండిపోతే పంటలు కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంకర్లు, బిందెలు, సీసాలతో పంటలకు చుక్కచుక్క నీళ్లు వేసే పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. మంత్రి సీతక్క(Minister Seethakka constituency) నియోజకవర్గమైన ములుగు పక్కనే ఉన్న రామప్ప డ్యామ్ గేట్లు మూసేశారని, రామప్పలో నీళ్ళు ఉన్నా గేట్లు మూసేయడంతో, డ్యాం కింద పొలాలు ఎండిపోయాయని ఆరోపించారు. రైతులకు నీళ్ళు ఇవ్వాలన్న జ్ఞానం మంత్రులకు ఉండాలి కదా? అని హరీశ్ రావు స్పష్టం చేశారు.






