కాటన్ రంగంలో సాంకేతికతపై చర్చ
సీఏఐ, ఐసీఏల మధ్య అవగాహన ఒప్పందం
హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): ఇంటర్నేషనల్ కాటన్ అసోసియేషన్, కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ కాటన్ శిక్షణ కార్యక్రమాలు కోయంబత్తూర్, అహ్మదాబాద్‌లో సంయుక్తంగా నిర్వహించారు.
కార్యక్రమాల ముగింపు సందర్భంగా కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు ఇంటర్నేషనల్ కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు పియర్ చహాబ్, మేనేజింగ్ డైరెక్టర్ బిల్ కింగ్ డన్‌లతో ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా, కోచ్ బెహార్ హాలులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఎన్ వినయ్ కోటక్, సీఏఐ మాజీ అధ్యక్షుడు అతుల్ గంట్రా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఎండి లలిత్ కుమార్ గుప్తా, తెలంగాణ కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, సీఏఐ డైరెక్టర్ బొమ్మినేని రవీందర్‌రెడ్డి, అంతర్జాతీయ కాటన్ సాంకేతిక రంగ నిపుణుడు డాక్టర్ రాబర్ట్ జియాంగ్, జేమీ వెల్ష్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో అంతర్జాతీయ కాటన్ సాంకేతిక రంగ నిపుణులు అంతర్జాతీయ కాటన్ ట్రేడ్‌పై అవగాహన ఒప్పందాల రక్షణ, కాటన్ వ్యాల్యూ చైన్‌లో వేగంగా చోటు చేసుకుంటున్న మార్పులు, సాంకేతికతలు, రిస్క్ మేనేజ్మెంట్, వ్యాపార విస్తరణ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఉత్తమ కాటన్ విధానాలను ప్రోత్సహించే లక్ష్యంతో సీఏఐ, ఐసీఏల మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. భారతదేశంలోని జిన్నింగ్, ప్రెస్సింగ్ పరిశ్రమల హక్కులు, బాధ్యతల మొదలగు విషయాలపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.






