11 April, 2026 | 11:41 AM

Breaking News

ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •   జ్యోతిరావు పూలే జయంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ   •   కోదాడ జాతీయ రహదారిపై ఘోర బస్సుప్రమాదం... స్పాట్‌లో 36 మంది..!   •   బిక్కనూర్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం – ఇద్దరు మృతి   •   ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు   •   అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్‌... హైకోర్టు లాయర్‌ ఫామ్‌హౌస్‌ కూల్చివేత   •   జీవితంపై విరక్తి చెంది ఇద్దరు యువకుల ఇద్దరు ఆత్మహత్య   •   స్నేహితుల ఆపన్న హస్తం.. మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం   •   మిస్టరీగా మారిన గద్వాల విద్యార్థిని అదృశ్యం   •  

ఈజీఎస్ నిధుల కేటాయింపులో వివక్ష తగదు

11-04-2026 12:00 AM

మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ 

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో చే యాల్సిన అభివృద్ధి పై ఎమ్మెల్యే కవ్వంపల్లి వివక్ష చూపుతున్నారని మానకొండూర్ మా జీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. శుక్రవారం మండలకేంద్రంలోని బిఆర్‌ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావే శం నిర్వహించారు.

ఈ సందర్బంగా రసమయి మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలకు సమానంగా ఉపాధి హామీ ని ధులు ఇవ్వకుండా ఎమ్మెల్యే కవ్వంపల్లి వివక్ష చూపుతున్నారని, కేంద్రం నుండి 60 శాతం నిధులు వస్తే రాష్ట్ర సర్కార్ నుంచి 40 శాతం మాత్రమే నిధులు ఇస్తున్నారని అన్నారు. అలాగే మండలంలోని 11 గ్రామాలకు నిధు లు ఇవ్వకుండా ఎమ్మెల్యే కవ్వంపల్లి ఎందు కు వివక్ష చూపుతున్నారని అన్నారు. బిఆర్‌ఎస్ సర్పంచులకు ఎంఎన్‌ఆర్ ఈజీఎస్ నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం, ఉపాధి హామీ నిధులు ఎవరి జా గీరు కాదని అన్నారు.

అలాగే పార్టీ మారాలని ఎమ్మెల్యే సర్పంచులను ఇబ్బందులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని ఇప్పటికైనా బేషరతుగా 24 గ్రామాలకు నిధులు ఎలా ఇచ్చారో, మిగితా 11 గ్రామాలకు కూ డా నిధులు విడుదల చేయాలనీ అన్నారు. లేదంటే నిధులు మంజూరు చేయని 11 గ్రామాలకు నిధులు ఇవ్వాలని కలెక్టర్ ను కలుస్తామని హెచ్చరించారు. అలాగే గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో పదేళ్ల పాటు ఏ ఒ క్కరి పట్ల వివక్ష చూపకుండా నిధులు ఇచ్చి అభివృద్ధి చేసామని తెలిపారు. అనంతరం ఇప్పటికైన ఎమ్మెల్యే కవ్వంపల్లి తన పద్ధతి మార్చుకొకపోతే తగిన గుణపాఠం చెపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీమా జీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సర్పంచులు మరిజె మోహన్ రావు, వికృతి స్నేహ- లక్ష్మా రెడ్డి, కముటం లావణ్య - రాములు, రడం లక్ష్మి ప్రవీణ్ తదితలున్నారు.