3 July, 2026 | 4:14 AM

ఆర్‌ఎస్ బ్రదర్స్‌లో 70% తగ్గింపు

03-07-2026 12:00 AM

ఆషాఢం ఛాలెంజ్ కేజీ సేల్ ప్రారంభం

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రాం తాల్లో ఆషాఢం ఛాలెంజ్ కేజీ సేల్‌ను ఆర్‌ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్స్‌లో శుక్రవారం నుంచి ప్రారంభించారు. ముఖ్యంగా వస్త్రాలపై అత్యంత అధికంగా 70% తగ్గింపుతో ‘అందానికి అందం... ఆదాకి ఆదా’ ఆషాఢం ఛాలెంజ్ కేజీ సేల్ ప్రత్యేకత. అత్యంత ప్రత్యేకమైన ఈ సందర్భం కొనుగోలుదారుల వార్డ్రోబ్స్ను సరికొత్త వెరైటీలతో, అందమైన డిజైన్లతో, ఆహ్లాదకరమైన రంగులతో కూడిన వస్త్ర వైవిధ్యంతో అలరిస్తుంది.

ఆషాఢం ఛాలెంజ్ కేజీ సేల్ ఒక మహత్తర అవకాశం. రాబోయే వేడుకలు, శుభకార్యాలు, పర్వదినాల వంటి సందర్భాలకు అవసరమైన నా ణ్యమైన వెరైటీలను లాభసాటిగా, పొదుపైన, సరిసాటిలేని ధరలతో సొంతం చేసుకోవడానికి దీన్ని మించిన అవకాశం లేదని చెప్పవచ్చు.

సరిసాటిలేని వెరైటీలతో కూడిన సంప్రదాయ శైలిలోని పట్టు చీరెలు, హై-ఎండ్ ఫ్యాన్సీ చీరెలు, ప్రత్యేక సందర్భాల కోసం లేటెస్ట్ డిజైన్లతో కూడిన చీరెలు ఈ విభాగంలో ఉన్నాయి. పురుషులకు హుం దాగా, ఠీవిని ప్రదర్శించే రీగల్ ఎత్నిక్ వేర్, షేర్వాణీలు, షార్ప్ క్యాజువల్స్, లేటెస్ట్ ట్రెం డ్స్‌తో కూడిన దుస్తులు ఈ విభాగంలో ఉన్నాయి. కిడ్స్‌కు ఎడోరబుల్ ఎత్నిక్ అవుట్-ఫిట్స్, చిరకాలం మన్నిక కలిగిన దుస్తులు, పిల్లలకు అందాన్ని తెచ్చే సరికొత్త ఫ్యాషన్స్ ఈ విభాగంలో ఉన్నాయి.