ఆకట్టుకున్న ఫ్యాషన్ షో
- ప్రత్యేక ఇండో కల్చరల్ అండ్ హాస్పిటాలిటీ ఈవెనింగ్
- బేగంపేట కంట్రీ క్లబ్‌లో కార్యక్రమ నిర్వహణ
హైదరాబాద్, జూలై 2(విజయక్రాంతి): బేగంపేట కంట్రీ క్లబ్‌లో ప్ర త్యేక ఇండో కల్చరల్ అండ్ హాస్పిటాలిటీ ఈవెనింగ్‌ను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రిపబ్లిక్ ఆఫ్ టర్కియే కాన్సుల్ జనరల్ ఓర్హాన్ యాల్మన్ ఒకాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కంట్రీ క్లబ్ వ్యవస్థాపకులు, చైర్మన్ రాజీవ్ రెడ్డి కాన్సుల్ జనరల్‌కు కంట్రీ క్లబ్ ప్రీమియం మెంబర్ షిప్ థాయ్‌లాండ్ మాస్టర్ కార్డ్‌ను అందజేసి ఘనంగా సత్కరించారు.
ఈ వేడుకల్లో భాగంగా టర్కియే సం పన్న సాంస్కృతిక వారసత్వం, నైపు ణ్య కళలు, ఆధునిక ఫ్యాషన్‌కు ప్రతిబింబంగా టర్క్ మోడా పేరుతో ప్ర త్యేక టర్కిష్ థీమ్ ఫ్యాషన్ షోను నిర్వహించారు. మూడు సీక్వెన్స్ లో కొన సాగిన ఫ్యాషన్ షో అందరిని మంత్రముగ్దులను చేసింది. భారత్ దేశాల మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు పరస్పర అవగాహనను పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా కొనసాగింది.
ఈ సందర్భంగా కంట్రీ క్లబ్ వ్యవస్థాపకులు, చైర్మన్ రాజీవ్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ పర్యాటకం, ఆతిథ్య రంగాల ద్వారా ప్రజలు, సంస్కృతు లు, దేశాలను అనుసంధానించడం కంట్రీ క్లబ్ లక్ష్యమని చెప్పారు. సంస్థ అంతర్జాతీయ విస్తరణలో తదుపరి దశలో యూరప్‌నకు వ్యూహాత్మక ప్రవేశ ద్వారంగా టర్కియేను పరిగణిస్తున్నట్లు వెల్లడించారు.






