30 August, 2026 | 11:57 AM

అడ్లూరి శ్రీనివాస్‌ను పరామర్శించిన డీఐసీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్

30-08-2026 10:50 AM

బీజేపీ రాష్ట్ర నాయకులు అడ్లూరి శ్రీనివాస్‌ను పరామర్శించిన డీఐసీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ సోహన్ యాదగిరి

బోధన్, ఆగస్టు 30(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, న్యాయవాది అడ్లూరి శ్రీనివాస్(Adluri Srinivas) తండ్రి మలయ్య ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (DIC) తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ సోహన్ యాదగిరి అడ్లూరి శ్రీనివాస్‌ను పరామర్శించి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా మలయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన సోహన్ యాదగిరి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

మలయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. అడ్లూరి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పరామర్శించిన ఆయన, మృతుని కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఆప్తుడిని కోల్పోవడం ఎంతో బాధాకరమైన విషయమని, ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని మలయ్య మృతికి సంతాపం తెలిపారు.