12 July, 2026 | 2:38 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

తేలుకాటుకు భక్తుడి మృతి

02-02-2026 12:00 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేవాగు చింతగట్టు సమీపంలో ఉన్న సమ్మక్క సారలమ్మ జాతర వద్ద జరిగిన తేలుకాటు సంఘటనలో రెడ్యాల గ్రామానికి చెందిన భక్తుడు కిన్నెర క్రిష్ కుమార్ (19) మరణించినట్లు గూడూ రు పోలీసులు తెలిపారు. క్రిష్ కుమార్ గత నెల 29న జాతరకు వచ్చి అడవిలో వంట చేసుకునేందుకు ప్రదేశాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో తేలు కుట్టడంతో అస్వస్థతకు గురయ్యాడు.

తక్షణమే అతనిని గూడూరు ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించగా, అనంతరం ఇంటికి వెళ్లాడు. తరువాత ఆదివారం సాయంత్రం వాంతులు అవుతుండటంతో మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా, చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 11.13 గంటలకు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడి పెద్ద నాన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు గూడూర్ పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.