28 July, 2026 | 1:46 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

17వ వార్డు తమ్మరలో వాగు పూడికతీత పనులు ప్రారంభం

29-05-2026 12:58 AM

మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు

కోదాడ, మే 28: వర్షాకాలంలో పట్టణ ప్రజలకు వరద ముంపు సమస్యలు తలెత్తకుండా మున్సిపాలిటీ పరిధిలో ముందస్తు చర్యలు చేపట్టామని కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఏర్నేని కుసుమ వెంకటరత్నం బాబు తెలిపారు. గురువారం కోదాడ పట్టణంలోని 17వ వార్డు తమ్మర సమీపాన ఉన్న వాగులో పూడికతీత, పేరుకుపోయిన వ్యర్థాల తొలగింపు పనులను ఆమె స్వయంగా పరిశీలించి ప్రారంభించారు.

వరద నీరు సాఫీగా ముందుకు సాగక  పట్టణ ప్రజలు, శిరిడి సాయి నగర్ ప్రాంత వాసులు ముం పునకు గురై అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. వరద నీరు ఎలాంటి అ డ్డంకులు లేకుండా సాఫీగా వెళ్లేలా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రమాదేవి కౌన్సిలర్లు యలమందల నరసయ్య, కర్రీ సుబ్బారావు, నాయకులు బుర్ర పుల్లారెడ్డి, నాగేంద్రబాబు, శ్రీనివాస్, భాస్కర్,లైటింగ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.