23 March, 2026 | 8:48 AM

పేదరికంతో చదువు ఆగకూడదు

23-03-2026 12:00 AM

పేదింటి బిడ్డకు ఆర్థిక సాయం అందించిన డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి 

మహబూబ్ నగర్, మార్చి 22 (విజయక్రాంతి): పేదరికంతో ఏ బిడ్డ చదువు ఆగకూడదని సంకల్పంతో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విద్యా నిధిని ఏర్పాటు చేసి అవసరమైన వారికి అండగా నిలబడడం జరుగుతుందని కార్పొరేషన్ డిప్యూటీ మే యర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు.

ఆదివారం మహబూబ్ నగర్ పట్టణంలోని 38వ డివిజన్ కి చెందిన బి.వెంకటేశ్వర్లు, లావణ్య దంపతుల కుమార్తె బి.భాగ్య లక్ష్మీ ఉచితంగా ఎంబీబీఎస్ సిట్ సాధించి 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్ధినికి కళాశాల, హాస్టల్ ఫీజుల నిమిత్తం రూ 2,10,000 వెలను ఆర్థిక సాయంగా మహబూబ్ నగర్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి కూతురు ఎంఎస్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మా రేపల్లి మహతి రెడ్డి వారి కుటుంబం సభ్యుల ఆధ్వర్యంలో ఆ అమ్మాయికి అందించారు. చదువుపై ఏకగ్రత ఉంచి బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.