17 April, 2026 | 2:29 AM

అడుగంటిన జలం.. సమస్య జటిలం

17-04-2026 12:31 AM
  1. ఏజెన్సీలో వారం రోజులుగా సరఫరాకు నోచుకోని మిషన్ భగీరథ నీరు

తాగునీటి కోసం పరుగులు తీస్తున్న గిరిజనులు

ఉట్నూర్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి) :  భానుడు ఉగ్రరూపం దాల్చుండడంతో  రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటుతు న్నాయి. చెరువులు వాగుల్లో  చుక్కనీరు లేక ఎండిపోతున్నాయి. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతలైన ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ, ఇంద్రవె ల్లి, సిరికొండ, బజారత్నూర్, ఇచ్చోడ తదితర మండలాల పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గ్రామాల్లోని తాగునీటి బావులు, బోరు బావులలో నీరు లేకుండా పోయాయి. మిషన్ భగీరథ నీటి పైననే  కొన్ని గ్రామాల ప్రజలు ఆశలు పెట్టుకున్న వారం రోజుల నుండి మిషన్ భగీరథ నీరు సరఫరా  నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో అత్యవసర సమ యంలో పంచాయతీ ఆధ్వర్యంలో  మంచినీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి  ప్రజలకు నీరు అందిస్తున్నారు.

తాగు నీటికి పరుగులు..

వేసవి కాలంలో తాగునీటి సరఫరా  అస్తవ్యస్తంగా మారడంతో  గిరిజన గ్రామాల్లో ప్రజలు తాగునీటి కోసం పరుగులు తీస్తున్నా రు. గాదిగూడ మండలంలోని కుండి, పిప్రి తదితర గ్రామాల ప్రజలు  వ్యవసాయ చేనుల్లోని గుంతల వద్దకు పరుగులు తీస్తున్నారు. రెండు రోజుల క్రితం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ జాయింట్ కమిషనర్, జడ్పి డిప్యూ టీ సీఈవో రాథోడ్ రాజేశ్వర్, డిఆర్డిఓ పి.డి రవీందర్ రాథోడ్‌లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ ఆదేశాల గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిశీలించారు.

వారు సైతం గ్రామాల్లో భూగ ర్భ జలాలు తగ్గినట్లు, మిషన్ భగీరథ నీటి సరఫరా కాకపోవడాన్ని సైతం వల్ల గుర్తించారు. గాదిగూడ మండలంతో పాటు ఇంద్రవెల్లి మండలంలోని 25 గ్రామాల్లోని గిరిజనులు తాగునీటి కోసం పరుగులు తీస్తున్నారు. ఉట్నూర్ మండలంలోని ఆయా గ్రామాల ప్రజలతో పాటు నార్నూర్ మండలంలోని  పలు గ్రామాల గిరిజనులు తాగునీటి కోసం పరుగులు తీస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తాగునీటి ఇబ్బందులు రాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.

ముందస్తు సమావేశాలు కరువు...

ప్రతి ఏటా వేసవిలో ఏజెన్సీ గ్రామాల్లో తాగునీటి సమస్య వస్తునే ఉంది. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తుకుండా మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికా రులు  ముందస్తు చర్యలకు తీసుకోవడానికి ప్రత్యేక సమావేశాలు నిర్వహించేవారు. కానీ వేసవి కాలం ప్రారంభమై రెండు నెల లు గడిచిన  నేటికీ మండల, డివిజన్, జిల్లా స్థాయిలో  ప్రజా ప్రతినిధులు, సర్పంచులతో  అధికారులు సమావేశం నిర్వహించడం పై దృష్టి సారించడం లేదు.

మారుమూల గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందని గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ అధికారులతో పాటు, మిషన్ భగీరథ అధికారులకు ఫోన్ చేస్తే అధికారులు ఫోన్లు తీయడం లేదని  సర్పంచులు వాపోతున్నారు. ఇంద్రవెల్లి మండలంలోని తేజపూర్ పంచాయితీ పరిధిలోని గత నెల రోజుల నుండి మిషన్ భగీరథ నీరు రావడం లేదంటూ ఏఈలకు ఫోన్ చేస్తే ఫోన్ తీయడం లేదని, ఫోన్ చేసినా తిరిగి ఫోన్ చేయడం లేదని తేజపూర్ సర్పంచ్  కోవ రాజేశ్వర్ వాపోయారు. ఆయనతో పాటు పలువురు  సర్పంచులు మాట్లాడుతూ.... ఇంద్రవెల్లి మం డల ఏఈఈలు తాగునీటి సరఫరా శాఖలు పనిచేస్తున్న వారిని వెంటనే సరెండర్ చేసి  కొత్తవారిని నియమించాలని సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు.

విద్యుత్ అంతరాయంతోనే..

కొమరం భీం జిల్లాలోని వట్టి వాగు ప్రాజెక్టు నుండి ఉట్నూర్ ఏజెన్సీలో గ్రామాలకు సరఫరా అయ్యే మిషన్ భగీరథ నీటికి  విద్యుత్ సరఫరా అంతరా యం ఉంది. కొమురం భీం జిల్లా  జైనూ రు మండలం బూస్ మెట్ట వద్దగల నీటి సరఫరా సంపు వద్ద విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల గత ఐదు రోజుల నుం చి నీటి సరఫరా నిలిచిపోయింది. మరో రెండు రోజుల్లో విద్యుత్ సమస్య తీరిపో యి భగీరథ నీటి సరఫరా జరుగుతుంది. ప్రజలు ఆందోళన చెందొద్దు.

 వేణు, ఏ.ఈ, మిషన్ భగీరథ ఇంద్రవెల్లి