క్రీడాప్రాంగణం.. పేరుకే పరిమితం..!
- లక్షల ప్రజాధనం వృథా
నిర్వహణ లేక నిరుపయోగం క్రీడా ప్రాంగణాలు
గుట్టలు, రాళ్లు, మొక్కలతో దర్శనం ఇస్తున్న వైనం
వినియోగంలోకి తేవాలనీ క్రీడాకారుల వేడుకోలు
పాలకవీడు, ఏప్రిల్ 16 : గ్రామీణప్రాంత క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీయాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం గ్రామాల్లో క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేసింది. ఒక్కో క్రీడాప్రాంగణానికి రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు నిధులు కేటాయించింది. మండలంలోని పలు గ్రామాల్లో క్రీడాప్రాంగణాలు నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. క్రీడా సామగ్రి, పరికరాలు లేక కేవలం బోర్డులకే పరిమితమయ్యాయి. అధికారుల పర్యక్షవేణ కొరవడడంతో పిచ్చిమొ క్కలతో దర్శనమిస్తున్నాయి. ఆటస్థలాలు మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. లక్షలాది రూపాయాల ప్రజాధనం వృథాగా మారింది.
ప్రజాధనం వృధా
పల్లెల్లో క్రీడలను ప్రోత్సహిస్తూ యువతలోని నైపుణ్యాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. కానీ, నిర్వహణ సరిగా లేక నిరుపయోగంగా మారాయి. క్రీడా ప్రాంగణాలు కేవలం బోర్డులకే పరిమితమయ్యాయి. కొన్నిచోట్ల క్రీడాప్రాంగణాల్లో అసాంఘిక కార్యకలాసాలకు, మందుబాబులకు అడ్డాగా మారాయి. ప్రతీ క్రీడా ప్రాంగణం ఎకరం విస్తీర్ణం తగ్గకుండా ఉండాలని ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో మాత్రం అమలుకు నోచుకోలేదు. రూ. లక్షలు ఖర్చుచేసినా ప్రాంగణాలు పనికిరాకుండా పోయాయి.
మండలంలోని పలు గ్రామ పంచాయతీలో క్రీడా సామగ్రి కనిపించకుండా పోయింది. ప్రతీ క్రీడా ప్రాంగణానికి రూ. 2.లక్షల నుంచి 5 లక్షల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. దీంతో కోట్ల రూపాయలు వృథాగా మారాయని క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వ లక్ష్యం నీరుగారిందరడంలో ఎటువంటి సందేహం లేదు.
అధికారుల పట్టింపేది..?
అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ప్రస్తుతం క్రీడా ప్రాంగణాలపై పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మండలంలోని పాలకవీడు, శూన్యపహాడ్, రావిపహాడ్ తో పాటు పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణంలో ప్రస్తుతం కంప చెట్లు,రాళ్లు రప్పలు, పొదలు దర్శనమిస్తున్నాయి.
అయినా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. చాలా గ్రామాలలో క్రీడా ప్రాంగణాల దుస్థితి ఇలాగే ఉంది. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి క్రీడామైదానాలను వినియోగంలోకి తేవాలని గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులు కోరుతున్నారు.
క్రీడా ప్రాంగణాల్లో వసతులు కల్పించాలి..
సరైన ఆట స్థలాలు లేక బీడు భూముల్లో ఆట లు ఆడాల్సి వ స్తుంది. అధికారులు చొరవ చూ పి యువతకు స్పో రట్స్ కిట్స్, వ్యాయామ ఉపాధ్యాయులను కేటాయించి క్రీడా ప్రతిభను వెలికి తీయాలి. క్రీడా ప్రాంగణాల్లో పూర్తిస్థాయిలో వసతులు కల్పించాల.
ఎన్.రమేష్, క్రీడాకారుడు, మహంకాళిగూడెం






