28 August, 2026 | 1:54 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

డీలిమిటేషన్ మరో పెద్ద నోట్ల రద్దు

18-04-2026 01:37 AM

ఎంపీ శశిథరూర్ 

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: డీలిమిటేషన్ మరో పెద్ద నోట్ల రద్దు అంశంలా మారబోతుందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన అంటే ఒకరకంగా రాజకీయ విలువను తగ్గించడమేనని, మహిళా రిజర్వేషన్లను పునర్విభజనతో ముడిపెట్టొద్దని, నారీశక్తి కానుకకు ప్రధాని ముళ్ల కంచె వేశారని, డీలిమిటేషన్ మరో పొలిటికల్ డిమానిటైజేషన్ అని విమర్శించారు.

మహిళా రిజర్వేషన్లను పార్లమెంట్ స్థానాల విస్తరణతో ముడిపెట్టడం భావ్యం కాదన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అనుబంధ సవరణలు, డీలిమిటేషన్ బిల్లులపై చర్చ సందర్భంగా థరూర్ శుక్రవారం లోక్‌సభలో మాట్లాడారు. బిల్లులతో నారీ శక్తికి న్యాయాన్ని కానుకగా ఇస్తున్నామని ప్రధాని పేర్కొన్నారనా, కానీ దాన్ని డీలిమిటేషన్‌తో ముడిపెట్టి ఆ కానుకకు ప్రధాని ముళ్ల కంచె వేశారని చెప్పారు. ఇది మహిళలను బందీ చేయడమేనని పేర్కొన్నారు.