17 May, 2026 | 2:35 AM

డెక్కన్ ఆర్థ్రోప్లాస్టీ సమ్మిట్

17-05-2026 12:00 AM

యశోద హాస్పిటల్స్ ఆధ్యర్యంలో రోబోటిక్- అసిస్టెడ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీపై రెండు రోజుల డెక్కన్ ఆర్థ్రోప్లాస్టీ సమ్మిట్ 2026 జాతీయ సదస్సు, లైవ్ వర్క్ షాప్‌ను నిర్వహిస్తున్నారు. 500 మందికి పైగా ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్లు, జాయింట్ రీప్లేస్మెంట్ నిపుణులు, వైద్య రంగ ప్రతినిధులతో యశోద హాస్పిటల్స్ జాతీయ డెక్కన్ ఆర్థ్రోప్లాస్టీ సమ్మిట్ 2026  కాన్ఫరెన్స్ అండ్ లైవ్ వర్క్ షాప్ విజయవంతంగా నిర్వహించారు.

యశోద హాస్పిటల్స్ -సికింద్రాబాద్ ఆధ్వర్యంలో రోబోటిక్ -అసిస్టెడ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, కాంప్లెక్స్ ట్రామా మేనేజ్మెంట్, స్పోర్ట్స్ మెడిసిన్, ఆర్థ్రోప్లాస్టీ వైద్య రంగాల్లో జరుగుతున్న అధునాతన సాంకేతిక పురోగతులు, వినూత్న శస్త్రచికిత్స విధానాలు, రోగుల సంరక్షణలో ఉత్తమ వైద్య పద్ధతులపై అవగాహన కల్పించే ప్రతిష్టాత్మక శాస్త్రీయ సదస్సు డెక్కన్ ఆర్థ్రోప్లాస్టీ సమ్మిట్ 2026 శనివారం హోటల్ మ్యారీగోల్డ్స్‌లో ఘనంగా ప్రారంభమైంది.

ఈ జాతీయ సదస్సును యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్‌గోరుకంటి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ సదస్సులో దేశవ్యాప్తంగా 500 మందికి పైగా ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ స్పెషలిస్టులు పాల్గొంటారు. ఇంకా ఆర్థోపెడిక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యవిద్యార్థులు, ఆరోగ్య రంగనిపుణులు కూడా హాజరవుతారు. ఈ సదస్సులో పాల్గొని ఆర్థ్రోప్లాస్టీ వైద్య రంగంలోని తాజా పరిణామాలపై చర్చించారు.

ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. డెక్కన్ ఆర్థ్రోప్లాస్టీ సమ్మిట్ 2026 ద్వారా ఆర్థోపెడిక్ విద్య, శస్త్రచికిత్స నైపుణ్యం, అకాడెమిక్ సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని యశోద హాస్పిటల్స్ లక్ష్యంగా పెట్టుకుం దన్నారు. అనుభవజ్ఞులైన సర్జన్లు, యువ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు, వైద్య సిబ్బంది ఒకే వేదికపై కలిసి జాయింట్ రీప్లేస్మెంట్ రంగంలోని అత్యాధునిక పద్ధతులపై చర్చించేందుకు ఈ సమ్మిట్ వేదికవుతుందన్నారు.

లైవ్‌సర్జరీలు, నిపుణుల చర్చలు, ఇంటరాక్టివ్ సెషన్ల ద్వారా ఆధునిక శస్త్రచికిత్స విధానాలు, ప్రెసిషన్ ఆధారిత చికిత్సలు, రోగు ల ఫలితాలను మెరుగుపరిచే సాంకేతికతలపై యువ వైద్యులకు ఈ సదస్సు ఎంతో దోహదపడుతుందని యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్. పవన్ గోరుకంటి పేర్కొన్నారు. 

కేసు ఆధారిత లెర్నింగ్

ఈ సదస్సు గురించి సికింద్రాబాద్ -యశోద హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ టీ జయకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కేస్ ఆధారిత లెర్నిం గ్, ప్రాక్టికల్ సర్జికల్ డెమోన్స్ట్రేషన్స్ ద్వారా వైద్యులకు సమగ్ర అవగాహన కల్పించడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. మోకాలి, హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సల్లో తాజా పురోగతులు, రోగిభద్రత, రిహాబిలిటేషన్ విధానాలు, మెరుగైన శస్త్రచికిత్స ఫలితాలపై ప్రత్యే కంగా చర్చిచామన్నారు.

సదస్సులో భాగంగా నిర్వహించిన రోబోటిక్ హిప్, మోకాలి జా యింట్ రీప్లేస్మెంట్ లైవ్ సర్జరీలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆధునిక సర్జికల్ టెక్నిక్స్, అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించే రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ విధానాలపై పాల్గొన్న వైద్యులకు ప్రత్యక్ష అవగాహన కల్పించారని తెలిపారు. ఇంటరాక్టివ్ కేస్-బేస్డ్ డిస్కషన్స్, ఆర్థ్రోప్లాస్టీలో ప్రస్తుత ధోరణులపై నిపుణుల ప్రసంగాలు, అడ్వాన్స్‌డ్ జాయింట్ రీకన్‌స్టక్షన్స్‌పై సెషన్స్ నిర్వహించామని తెలిపారు.