1 June, 2026 | 2:20 PM

Breaking News

బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ తహసిల్దార్..   •   డాక్టర్ కళ్యాణికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు సన్మానం   •   విచారణకు హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్ రెడ్డి   •   నెల చివరి వరకు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు   •   రామంతాపూర్‌లో RTC బస్సును ఢీకొట్టిన కారు   •   పిడుగుపాటుకు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మీ   •   ఆయిల్ పామ్ నర్సరీలో నాణ్యమైన మొక్కలు సిద్ధం చేయాలి   •   అంగన్వాడి కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి సీతక్క   •   BRS నేతల ముందస్తు అరెస్టులు.. అప్రజాస్వామికం   •   సీఎం జనజాతర సభకు మార్లవాయి గ్రామస్తుల భారీ తరలింపు   •  

World Bicycle Day: జూన్‌ 3న సైకిల్ ర్యాలీ

01-06-2026 01:31 PM

కరీంనగర్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ బాధ్యులు 

ముకరంపుర, జూన్ 1(విజయక్రాంతి): ప్రపంచ సైక్లింగ్ దినోత్సవం జూన్ 3 సందర్భంగా కరీంనగర్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్, ఏ. జె. పెడల్స్‌ సంయుక్త నిర్వహణలో తలపెట్టిన సైక్లింగ్‌ ర్యాలీలో ఔత్సాహిక సైక్లిస్టులు, సైక్లింగ్ క్రీడాకారులు పాల్గొనాలని జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ చైర్మన్‌ వి. నరేందర్ రెడ్డి, అధ్యక్షులు కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డిలు విజ్ఞప్తిచేశారు.

సోమవారం నగరంలో నిర్వహించిన సైకిల్‌ ర్యాలీ పోస్టర్‌ను విడుదల చేసి మాట్లాడుతూ 03 జూన్‌  ఉదయం 5:30 గంటలకు తెలంగాణ చౌక్‌ నుంచి ఎలగందల వరకు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామని, ఈ ర్యాలీలో పాల్గొని పూర్తి చేసిన సైక్లిస్టులకు ప్రశంసాపత్రాలు అందజేస్తామని తెలిపారు. ఆసక్తి కలిగిన అన్ని వయస్సుల వారు ఈ ర్యాలీలో తమ సైకిల్‌లతో పాల్గొన వచ్చని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు బుధవారం రోజు ఉదయం 5:30 గంటలకు తెలంగాణ చౌరస్తా వద్ద రిపోర్టు చేయాలని కోరారు. ఈ  కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సురభి వేణుగోపాల్,  తదితరులు పాల్గొన్నారు.