ఎకరం 237 కోట్లు
- రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో భూములకు రికార్డు ధర
- సర్వే నంబర్ 83/1లోని 6 ఎకరాల 9 గుంటల భూమికి టీజీఐఐసీ వేలం
- దక్షిణ భారతదేశంలోనే ఇదే అత్యధికం
హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్‌కు అత్యంత సమీపంలోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో భూముల ధరలు మరోసారి సంచలనం సృష్టించాయి. టీజీఐఐసీ గురువారం నిర్వహించిన భూ వేలంలో ఎకరాకు రూ. 237 కోట్ల ధర పలికి రికార్డు నెలకొల్పింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ పరిధిలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న 6 ఎకరాల 9 గుంట ల భూమిని టీజీఐఐసీ వేలానికి పెట్టగా, రి యల్ ఎస్టేట్ సంస్థలు భారీగా పోటీపడ్డా యి.
చివరకు ప్రముఖ సంస్థ గౌర వెంచర్స్ ఈ భూమిని దక్కించుకున్నది. వేలం ముగిసేసరికి ఎకరాకు రూ.237 కోట్ల ధర నమోద వడంతో రియల్ ఎస్టేట్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నాయి. గత ఏడాది ఇదే ప్రాం తంలో జరిగిన మరో వేలంలో ఎకరం ధర రూ.177 కోట్లకు చేరగా, ఈసారి దాన్ని దాటి కొత్త రికార్డు నమోదు కావడం గమనార్హం. కేవలం ఏడాది వ్యవధిలోనే భూమి విలువ దాదాపు రూ.60 కోట్ల మేర పెరగడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వేగాన్ని ప్రతిబింబిస్తోందని నిపుణులు చెప్తున్నారు.
వేలం వేసిన ఈ భూమి మల్టీ-యూజ్ క్యాటగిరీలో ఉండటం కూడా భారీ ధరకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. కమర్షియల్ టవ ర్లు, హైఎండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు, రిటై ల్ స్పేస్‌లు, స్టార్ హోటల్స్ వంటి ఏ ప్రాజెక్టుకైనా అనువుగా ఉండటంతో పెట్టుబడిదా రులు ఆసక్తి చూపినట్టు తెలుస్తున్నది.
ఇక ఈ ప్రాంతానికి ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యం కూడా ధర పెరగడానికి దోహదపడింది. మైండ్‌స్పేస్ ఐటీ పార్క్, టీ టీ వర్క్స్, క్వాల్కామ్ క్యాంపస్, రాయదుర్గం మెట్రో స్టేషన్ వంటి కీలక కేంద్రాలకు అత్యం త సమీపంలో ఉండటం వల్ల ఈ భూమికి భారీ డిమాండ్ ఏర్పడింది. హైదరాబాద్ ఐటీ విస్తరణ, గ్లోబల్ కంపెనీల పెట్టుబడు లు, పెరుగుతున్న కమర్షియల్ కార్యకలాపాలు రాయదుర్గం కారిడార్‌ను దేశంలోనే అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ జోన్లలో ఒకటిగా నిలిపాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణ భారతదేశంలోనే ఇది అత్యధిక భూ ధర కావచ్చని రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటున్నారు.






