30 March, 2026 | 4:30 PM

గిగ్ వర్కర్లపై దాడులు జరిగినా దిక్కులేదు

30-03-2026 02:34 PM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. కొత్తగూడెం నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు(CPI MLA Kunamneni Sambasiva Rao) మాట్లాడుతూ... గిగ్ వర్కర్లపై దాడులు జరిగినా దిక్కులేదని ధ్వజమెత్తారు. గిగ్ వర్కర్లు ఆలన పాలన, చిరునామా సరిగా ఉండదని చెప్పారు. గిగ్ వర్కర్లకు సంబంధించి సంక్షేమ బోర్డు పెడతామన్నా అంశంపై కూనంనేని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనేక రంగాల వారిని అసంఘటిత రంగ కార్మికులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. వివిధ రంగాల కార్మికులకు పీఎఫ్ వర్తింపజేయాలని కూనంనేని కోరారు. వ్యక్తి కేంద్రీకృతంగా బడ్జెట్ ప్రవేశపెట్టాలని కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.