నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
రూ.91వేల నకిలీ నోట్లు స్వాధీనం
షిఫ్టు డిజైర్ కారు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం
ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి,(విజయక్రాంతి): నకిలీ నోట్ల చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాకు కామారెడ్డి పోలీసులు చెక్ పెట్టారు. కామారెడ్డి జిల్లా పిట్లంలో 500 నకిలీ నోట్లను చలమని చేసినందుకు పెట్రోల్ బంకులో 2000 పెట్రోల్ పోసుకొని నకిలీ నోట్లు ఇచ్చి వెళ్తుండగా శ్రీకాంత్ రెడ్డి గుర్తించి వారిని వెంబడించగా పరారయ్యారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పిట్లం పోలీసులు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా పోలీస్ లా మూడు బృందాలను ఏర్పాటు చేసి నకిలీ నోట్ల చలామణి ముఠా ఆగడాలపై దృష్టి సారించి దర్యాప్తు చేపట్టారు.
మహారాష్ట్రకు చెందిన రాహుల్ రావు సాహెబ్ అవాడ్, ప్రదీప్ ధ్యానోప డాల్వే, భీమ్ శంకర్ రామ్ రావ్ వైద్య, లో హైదరాబాద్ కు వెళ్తుండగా గుర్తించి ధర్మారం టోల్ ప్లాజా సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో నిందితులో హైదరాబాద్లో నకిలీ కరెన్సీ సేకరించి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు. నకిలీ కరెన్సీని సరఫరా చేసిన వ్యక్తులతో పాటు ఈ నెట్వర్క్ లోని ఇతర వ్యక్తుల పాత్ర పై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.
వారి వద్ద నుంచి రూ.500 ల విలువైన 182 నకిలీ నోట్లు రూ. 91000, షిఫ్ట్ డిజైర్ కారు, మూడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో చక చక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన బాన్సువాడ రూరల్ సిఐ తిరుపతయ్య, పిట్ల మెసేజ్ ఆంజనేయులు, పిట్లం పోలీస్ సిబ్బంది శైలేష్, రాము, వెంకటేష్ లను ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తక్కువ మొత్తంలో అసలు నోట్లు ఇస్తే రెట్టింపు నకిలీ కరెంటు ఇస్తామని చెప్పే వ్యక్తులను నమ్మవద్దని కోరారు. నకిలీ కరెన్సీ కొనుగోలు చేయడం కలిగి ఉండడం చలా మనీ చేయడం చట్టరీత్యా నేరం తీవ్రమైన నేరం గనుక ఇలాంటి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పి కోరారు. ఈ సమావేశంలో బాన్సువాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి, సీఐ తిరుపతయ్య, పిట్లం ఎస్ఐ ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






