28 August, 2026 | 10:59 PM

రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి

28-08-2026 09:52 PM

చెన్నూర్,(విజయక్రాంతి): వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని చెన్నూర్ పోలీసు ఎస్సై శ్యామ్ పటేల్ కోరారు. శుక్రవారం స్థానిక ప్రతాప్ మారుతి హనుమాన్ ఆలయం సమీపంలో వాహనదారులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్క వాహనదారుడు నిబంధనల మేరకు తమ వాహనాలకు నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, మద్యం సేవించి వాహనం నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.