11 April, 2026 | 4:02 AM

నూతన దంపతుల వివాహానికి కానుకగా కౌన్సిలర్ నగదు సాయం

11-04-2026 12:00 AM

వేములవాడ, ఏప్రిల్ 10,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజ్పల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన వివాహ వేడుకలో 2వ వార్డు కౌన్సిలర్ ఏనుగు జ్యోతి - తిరుపతిరెడ్డి నూతన దంపతులకు పెళ్లికానుకగా రూ.10,016 అందజేశారు. గడ్డం అంతగిరిరాజేశ్వరి దంపతుల కుమార్తె అఖిల వివాహానికి హాజరైన కౌన్సిలర్, ఈ సందర్భంగా తమ వంతు సహాయాన్ని అందించారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ ఏనుగు జ్యోతి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ, తమ వార్డు పరిధిలో జరిగే ప్రతి ఆడబిడ్డ వివాహానికి రూ.10,016 అందజేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గుడిసె శంకర్ (ఏజెంట్), మెట్ట దేవానంద్, గుడిసె సదానందం, రేగుల రాజేశం, భుపేందర్ రెడ్డి, చల్ల చంద్రయ్య, గుడిసె నాగరాజు, గుడిసె దాసు, సుద్దాల బాలయ్య, మల్లారపు తిరుపతి, విక్కుర్తి సాయి, సందరగిరి ప్రకాశ్, బావండ్ల శ్రీనివాస్, లింగంపల్లి అంజయ్య, గుండు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.