21-02-2026 12:51:06 PM
హైదరాబాద్: తెలంగాణ(Telangana) రాష్ట్రంలో ఫిబ్రవరి నెలాఖరు వరకు పత్తి కొనుగోళ్లు(Cotton purchases) కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి మేరకు సీసీఐ ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న వ్యవసాయశాఖ కార్యదర్శి జాయింట్ సెక్రటరీ, కేంద్ర జౌళిశాఖకి లేఖ రాశారు. పత్తి కొనుగోళ్ల గడువును పొడిగించాలని ఇప్పటికే మంత్రి తుమ్మల కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని(Union Minister Kishan Reddy) కోరారు. కేంద్ర ప్రభుత్వం, సీసీఐ నిర్ణయంతో మంత్రి తుమ్మల సంతోషం వ్యక్తం చేశారు. పొడిగించిన గడువును వినియోగించుకోవాలని పత్తి రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.