పత్తి దగ్ధం.. రూ. 50 కోట్ల నష్టం?
29-03-2026 01:02 AM
షాద్‌నగర్, మార్చి 28(విజయక్రాంతి): పత్తిగోదాములొ భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మీ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని శ్రీ కృష్ణ పత్తి గోదాములో మంటలు చెలరేగాయని, బయ టి నుంచి పొగ రావడం చూసిన సిబ్బంది పోలీసులకు, ఫైర్ ఇంజన్‌కు ఫోన్ చేశారని చెప్పారు. గోదాంలో నిల్వ ఉంచిన రూ. 50 కోట్ల పత్తి కాలిపోయినట్లు ప్రాథమిక అంచనా ప్రకారం తెలుస్తుందన్నారు.
ఈ గోదాంలో విద్యుత్ సరఫరా లేదని, గతరాత్రి కురిసిన వర్షం, ఉరుముల కారణంగా ప్రమాదం సంభవించిందా? మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ లక్ష్మీ నారాయణ వివరించారు.




