7 May, 2026 | 2:14 AM

సేవలు పదిలం

07-05-2026 01:19 AM

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి 

జడ్చర్ల, మే 6: గత ఐదేళ్లపాటు మీరు చేసిన సేవలు పదిలంగా ఉంటాయని ప్రజలు ప్రతి ఒక్కరు మిమ్మల్ని అభినందిస్తున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం సమయం ముగింపు సమావేశంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేసిన పాలకమండలి సభ్యుల సేవలను ఎమ్మెల్యే అభినందించారు.

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను ప్రత్యేకంగా సన్మానించి, వారి సేవలకు కృతజ్ఞతలు తెలియజేసి, భవిష్యత్తులో కూడా ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షించారు. పట్టణ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేసిన విధానం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.జడ్చర్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.