29 May, 2026 | 4:38 AM

సహకారంతోనే జల వివాదాలకు చెక్

29-05-2026 01:03 AM

ప్రధాని మోదీ 

న్యూ ఢిల్లీ, మే 28: దేశంలోని జల వివాదాలలను సహకార ధోరణితో పరిష్కరించుకోవా లని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు రాష్ట్రాలకు సూచించారు. కెన్ ప్రాజెక్టు ఓ నమూనాగా నిలవాలని చెప్పారు. సేవాతీర్థ్‌లో గురువారం జరిగి న సమావేశంలో ప్రధాని తొమ్మిది రాష్ట్రాలలో రైల్వే, విద్యుత్, రహదారి రంగాలకు సంబంధించిన ఏడు ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. కెన్ నదుల అనుసంధాన ప్రాజెక్టు సహా ఆయా రాష్ట్రాల్లో రూ.30వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.

ప్రాజెక్టుల అమలు లో జాప్యం, ఖర్చుల పెరుగుదలకు దారితీయడమే కాకుం డా, పౌరులకు అవసరమైన సౌకర్యాలను సకాలంలో అందకుండా చేస్తుందన్నారు. నదుల అనుసంధానం, జల సంరక్షణ వంటి అంశా ల్లో అవకాశాలను గుర్తించాలని సూచించారు.