17 July, 2026 | 2:30 PM

Breaking News

మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి   •   స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •  

టీజీ20 లీగ్ నిబంధనలకు విరుద్ధం : టీసీఏ

06-05-2026 12:00 AM

యువక్రికెటర్ల భవిష్యత్తుతో ఆడుకోవద్దు

జిల్లాల్లో క్రికెట్‌కు హెచ్‌సీఏ చేసిందేమీ లేదు

హన్మకొండ, మే 5 : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన టీజీటీ20 లీగ్ ను తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. హెచ్‌సీఏ నిర్వహిస్తోన్న టోర్నీ చట్టవిరుద్ధమనీ ఆగ్రహం వ్యక్తం చేసింది. లీగ్‌ను నిలిపివేయకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.

రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ విస్తరణ అంటూ హెచ్‌సీఏ చేస్తున్న ప్రచారం అవాస్తవమని పేర్కొంది. జిల్లాల్లో మౌలిక సదుపాయాలు, కమిటీలు, ఆటగాళ్ల నెట్‌వర్క్ వంటివి హెచ్‌సీఏ వద్ద లేవనీ, గత 80 ఏళ్లుగా హెచ్‌సీఏ జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి చేసిందేమీ లేదని గుర్తు చేసింది. ఐపీఎల్ జరుగుతున్న సమయంలో 15 రోజుల బఫర్ పీరియడ్‌లో స్టేట్ లీగ్స్ నిర్వహించకూడదన్న నిబంధనను కూడా హెచ్‌సీఏ ఉల్లంఘిస్తోందని టీసీఏ మండిపడింది.

ఈ అనుమతి లేని టోర్నమెంట్లలో పాల్గొంటే ఆటగాళ్లు, కోచ్‌లు, అంపైర్లు క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవాల్సి ఉం టుందని హెచ్చరించింది. యు వ క్రికెటర్ల భవిష్యత్తును హె చ్‌సీఏ ప్రమాదంలోకి నెడుతోందని టీసీఏ ఆందోళన వ్యక్తం చేసింది. టీసీఏతో సంప్రదింపులు జరిపి సలహాలు, సూచనలు తీసుకోవా లని కోర్టు ఆదేశాలున్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లాల్లో గత 12 ఏళ్లుగా టీసీఏ అభివృద్ధి చేసిన గ్రాస్‌రూట్ క్రికెట్ వ్యవస్థను ఆక్రమించుకునేందుకు హెచ్‌సీఏ ప్రయత్నిస్తోందనీ, దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తెలంగాణ పేరుతో నిర్వహించే ఏ లీగ్ అయినా పారదర్శకంగా, టీసీఏ కమిటీలు, టీసీఏ జిల్లా క్రికెటర్లకు సరైన ప్రాతినిథ్యం దక్కేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.