9 May, 2026 | 3:32 PM

Breaking News

బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు   •   బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి   •   రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!   •   వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు   •   సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత   •   VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం   •   శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా   •   బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •  

కాంగ్రెస్ హామీలు మాటలకే పరిమితం

29-11-2025 12:00 AM

మొయినాబాద్, నవంబర్ 28(విజయక్రాంతి): అధికారంలోకి వచ్చేందుకు అమలు కాని హామీలు ఇచ్చి   తీరా గద్దె నె క్కినాకా అట్టి హామీలను విస్మరించిందని బీఆర్‌ఎస్ రాష్ర్ట నాయకుడు కోంపల్లి అనంతరెడ్డి విమర్శించారు. మొయినాబాద్ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన సజ్జన్పల్లి గ్రామానికి చెందిన ఇతర పార్టీల నాయకులు బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్రెడ్డి ఆద్వర్యంలో కత్తుల కృష్ణ, కత్తుల నర్సిములతో పాటు పలువురు బీఆర్‌ఎస్లో పార్టీ లో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఇప్పుడు బీసీలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండ మోసం చేస్తున్నారని తెలిపారు.బీసీలకు న్యాయం చేస్తారని నమ్మి కాంగ్రెస్ ను అధికారంలోనికి తీసుకొస్తే బీసీలను స్థానిక సంస్థల ఎన్నికల్లో మోసం చేశారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను, వాగ్దానాలను పూర్తిగా విస్మరించడంతో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకాన్ని కోల్పోతున్నారని, మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోనికి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణ పాఠం చెప్పి బీఆర్‌ఎస్కు పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇతర పార్టీల మీద విశ్వాసం కోల్పోయి బీఆర్‌ఎస్ వైపు చూస్తూ బీఆర్‌ఎస్లో చేరుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు నర్సింహ్మరెడ్డి, మిథున్కుమార్, శ్రీకాంత్యాదవ్, నవీన్యాదవ్, చంద్రశేఖర్రెడ్డి, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.