గ్రామ సమస్యలపై షబ్బీర్ అలీతో కాంగ్రెస్ నాయకుల భేటీ
భిక్కనూర్,జూలై 23(విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ను భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామానికి సంబంధించిన పలు ప్రజా సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, వాటిని శ్రద్ధగా విన్న షబ్బీర్ అలీ సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నాయకులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పెద్దమల్లారెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు ఇటిక్యాల భాగారెడ్డి, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి, ఎల్లంరెడ్డి, వార్డు సభ్యులు వడ్ల శ్రీనివాస్, బుడ్డా సత్తయ్య, నట్ట లింగం, కంటి నర్సింలు, కొండల్ రెడ్డి, పిల్లి సంతోష్, పుట్ట బాలు, బొంది గణేష్ పాల్గొన్నారు.






