23 July, 2026 | 3:26 PM

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

23-07-2026 02:22 PM

బెజ్జూర్ జూలై 23 (విజయ క్రాంతి): మొక్కల సంరక్షణ అందరి బాధ్యత అని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ అన్నారు. బెజ్జూర్  మండలంలోని కుంటలమానేపల్లి గ్రామంలో ఎంపీడీఓ బి. యస్. ప్రవీణ్ కుమర్,సర్పంచ్ తో కలిసి ప్రారంభించారు. ఇందులో భాగంగా గ్రామంలో పండ్ల మొక్కలు,పూల మొక్కలు తదితర మొక్కలు పంపిణి చేశారు. నాటిన మొక్కలను సంరక్షించుకొని వాటి ఫలాలు పొందాలని గ్రామ ప్రజలను కోరినారు. మొక్కల సంరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి నాగరాజు, సర్పంచ్ గావిడే స్నేహ, వ్యవసాయ శాఖ అధికారి, రాజేష్, పంచాయతీ కార్యదర్శి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.