23 July, 2026 | 3:32 PM

రెజ్లింగ్ స్పోర్ట్స్ హాస్టల్లో బాలుర ఎంపికలకు ప్రవేశాలు

23-07-2026 02:28 PM

హనుమకొండలో రెజ్లింగ్ స్పోర్ట్స్ ఎంపికలు...

కొత్తగూడెం జూలై 23 విజయక్రాంతి: ఈనెల 27 28 తేదీలలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం నందు, రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్ నందు రెజ్లింగ్  హాస్టల్ లో,బాలుర ప్రవేశాలకు స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో,ఎంపిక లను నిర్వహించనున్నారు. 14 -16 సంవత్సరముల లోపు బాలురు,ఈ ఎంపిక పోటీలకు అర్హులని ఈ ఎంపికలు బాలురకు మాత్రమే జరుగునని,ఆసక్తి ఉన్న బాలురు ఈ సర్టిఫికెట్లతో హాజరు కావాలని  బర్త్ సర్టిఫికెట్,స్టడీ సర్టిఫికెట్ ,10తరగతి మెమో, ఒరిజినల్ ఆధార్ కార్డ్, 10 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని  హాజరు కాగలరని, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి  పి కాశీ హుస్సేన్ పత్రిక  ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలకు చెందిన రెజ్లింగ్ క్రీడాకారులు ఈ అవకాశాన్ని, సద్వినియోగం చేసుకోవాలని  కాశీ హుస్సేన్ పేర్కొన్నారు.