1 June, 2026 | 9:22 PM

విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

01-06-2026 07:57 PM

పెండింగ్ ఫీజు బకాయాలను విడుదల చేయాలి

టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు డాక్టర్ బాలు

కామారెడ్డి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు బకాయాలను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో వివిధ కోర్సులను పూర్తి చేసుకున్నప్పటికీ వారి సర్టిఫికెట్లను కళాశాలల నుండి విద్యార్థులు తీసుకోలేనటువంటి దుస్థితి రాష్ట్రంలో నెలకొని ఉన్నదని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు డాక్టర్ బాలు తెలిపారు. కాంట్రాక్టర్ల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల పైన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని,విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నదని గత ప్రభుత్వం అనుసరించిన విద్యార్థి వ్యతిరేక విధానాలనే అనుసరించడం సరికాదని అన్నారు.

వెంటనే రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని లేకపోతే విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు టి ఎన్ ఎస్ ఎఫ్ సిద్ధమవుతుందని అన్నారు. విద్యార్థులు నిరుద్యోగులను మోసం చేసినందుకే టిఆర్ఎస్ ప్రభుత్వానికి గత ఎన్నికల్లో గుణపాఠం చెప్పారని మరొకసారి అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి తప్పదని అన్నారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించి విద్యార్థులను ఆ దుకోవాలన్నారు.