9 May, 2026 | 11:26 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

గ్యాస్ ధరలు తగ్గించాలని ఆందోళన

09-03-2026 12:43 AM

ఎల్బీనగర్, మార్చి 8:  పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను  తక్షణమే ఉపసంహారించాలని సీపీఎం ఎల్బీనగర్ సర్కిల్ కార్యదర్శి ఆలేటి ఎల్లయ్య  డిమాండ్ చేశారు. వనస్థలిపురం రై తు బజార్ దగ్గర  సీపీఎం ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆలేటి ఎల్లయ్య  మాట్లాడుతూ పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

విశ్వ గురువును అని తనకు తాను చెప్పుకునే నరేంద్ర మోదీ యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పురుషో త్తంచారి, కాశయ్య, పోలె రమేశ్, పోలే వెంకటేశ్, రాధమ్మ, గంగమ్మ, కలమ్మ సైదమ్మ, పోలె లలిత, సుక్క అనిత, రాములమ్మ, భారతమ్మ, లక్ష్మి, వరలక్ష్మి, జయమ్మ, కృష్ణమూర్తి, లక్ష్మమ్మ, కాశమ్మ, ధనరాజు తదితరులు పాల్గొన్నారు.