గర్భాశయం ముఖద్వారా HPV వ్యాక్సినేషన్ పూర్తి
20-08-2026 05:15 PM
బాన్సువాడ, ఆగస్టు 20: కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ డిప్యూటీ DM&HO ఆదేశాల మేరకు 14 సంవత్సరాలు నిండి, 15 సంవత్సరాలలోపు ఉన్న బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ నివారణ లక్ష్యంగా HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. సింధు విద్యాలయం విద్యార్థినులతో పాటు జడ్పీహెచ్‌ఎస్ ప్రభుత్వ పాఠశాలలో అర్హులైన బాలికలందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ కార్యక్రమములో పాఠశాల ప్రిన్సిపాల్ జగన్ డిప్యూటీ డిఎం, బాన్సువాడ డివిజన్ ఆరోగ్య బోధకులు దస్థిరాం ,విస్తీర్ణ ఆరోగ్య అధికారి సుధాకర్, లక్ష్మి ఆరోగ్య సూపర్వైజర్, సిబ్బంద, మోహన్ గౌడ్, సిద్ధిరామ గౌడ్, ముజాహిద విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు






