జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సభ్యత్వం
సేవా పథకం ఆధ్వర్యం లో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ కార్యక్రమం
ముకరంపుర, ఆగస్టు 20 (విజయ క్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయంలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ కార్యక్రమం యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఉమేశ్ కుమార్ ప్రారంభించారు. యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు సభ్యత్వ కార్యక్రమాన్ని కొనసాగించాలని, సమాజ శ్రేయస్సు కోసం విశ్వవిద్యాలయం రెడ్ క్రాస్ సొసైటీతో కలిసి పనిచేస్తుందని తెలియచేశారు. ఇప్పటికీ శాతవాహనలో దాదాపు 350 సభ్యులు సభ్యత్వం తీసుకున్నారని ఇంకా ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఆచార్య ఉమేశ్ కుమార్ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పి. సతీష్ కుమార్, జాతీయ సేవా పథకం సమన్వయ కర్త డా. ఇ మనోహర్, పరీక్షల నియంత్రణాధికారి డా.సురేష్ కుమార్. అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీ. Y. కిషోర్, ప్రోగ్రాం ఆఫీసర్ డా. విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు






