21 April, 2026 | 3:33 AM

సెన్సస్ 2027ను పూర్తి చేయండి

21-04-2026 12:51 AM

మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్

జవహర్‌నగర్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సెన్సెస్ 2027 కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని జనాభా లెక్కల్లో గృహాల జాబితా గృహ జనన సక్రమంగా పూరించాలని మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని షామీర్పేట డివిజన్ తూముకుంట లోని విశ్వవిశ్వాని కళాశాలలో సెన్సెస్ 2027 కు సంబంధించిన ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల మూ డు రోజుల ట్రైనింగ్ క్యాంపును  మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ సోమవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎన్యుమరేటర్లతో సూపర్వైజర్లతో మాట్లాడుతూ దేశంలో జన గణనకు రంగం సిద్ధ మైందని ఈ సందర్భంగా ఎన్యుమరేటర్స్ 33 ప్రశ్నల సరళి ఉంటుందని తెలిపారు. సాధారణంగా జనాభా గృహ సంబంధిత సందేహాలు, స్వీయ గణనకు సంబంధించిన ప్రశ్నలు సహా అనేక రకాల అంశాలను ఎఫ్‌ఏ క్యూలుగా ప్రస్తావించారు.

అదనంగా ఇంటి ఫ్లోరింగ్ రూపులను ఉపయోగించే పదార్థాలు కుటుంబంలో నివసిస్తున్న సభ్యులు కుటుంబ పెద్ద వారు వినియోగించే ధాన్యాల రకాలు ప్రాథమిక ఆధునిక సౌకర్యాల లభ్యత సొంతంగా కలిగి ఉన్న వాహనాలకు సంబంధించిన ప్రశ్నలను వివరణలు ఈ సెన్సెస్ 2027లో ఎన్యుమరేటర్లు నమోదు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కీసర డిప్యూటీ కమిషనర్ వసంత ఏఎంసీలు ఏఈలు, డి ఈ లు తదితరులు పాల్గొన్నారు.