13-02-2026 12:14:32 AM
దొంగ ఓట్లు వేయించారని బీజేపీ ఆరోపణ
నల్గొండ టౌన్, ఫిబ్రవరి 12: నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల్లో పలు డివిజన్ లో నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి సమక్షంలోనే దొంగ ఓటు వేయించారని బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి అన్నారు గురువారం స్థానిక పార్టీ కార్యాలయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
10వ డివిజన్ లోజరిగిన సంఘటనపై వెంటనే విచారణ చేపట్టి డిఎస్పీ శివరాం రెడ్డి ని సస్పెండ్ చేయాలని, ఈ సంఘటనపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని డీఎస్పీపై చర్యలు తీసుకోకపోతే బిజెపి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యా ప్తంగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా. వ్యవహరించారని ఆరోపించారు ఎన్నికల్లో ఓట మి భయంతో పలు డివిజన్ లో దొంగ ఓట్ల కు కాంగ్రెస్ పార్టీ. తెరలేపిందని ఆరోపించారు. పలు పోలింగ్ బూతుల్లో డిఎస్పీ నే దొంగ ఓట్లు వేయించారని తెలిపారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కనుసైగల్లో పోలీసు ఉన్నత అధికారులు. పనిచేస్తున్నారని,తెలంగాణలో కాంగ్రెస్ ను రాళ్లతో కొట్టే పరిస్థితి రాబోతోందన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులకు ప్రజా ధనాన్ని కొల్లగొట్టడం, మజ్లిస్- మైనార్టీ ఓట్ల మీద ద్యాసే తప్ప, ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన ఏకోశాన లేదన్నారు.ఈ సమావేశంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర మాజీ కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్,బిజెపి నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్,జిల్లా ప్రధానకార్యదర్శి పోతెపాక లింగస్వామి, బిజెపి జిల్లా నాయకులు మంగిలిపల్లి కిషన్, పిండి పాపి రెడ్డి,BJYM రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి ,బిజెపి పట్టణ నాయకులు గాలి శ్రీనివాస్,మేకల అనిల్ కుమార్, తిరుమల మహేష్, సుధాకర్ పాల్గొన్నారు.