14 June, 2026 | 4:27 AM

రాజ్యాధికార సమరభేరికి రండి

14-06-2026 01:15 AM

 మాజీ ఐఏఎస్ చిరంజీవులుకు టీఆర్పీ నేతల ఆహ్వానం

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ఆధ్వర్యంలో జూలై 5న భువనగిరిలో నిర్వహించ నున్న భారీ బహిరంగ సభ ‘రాజ్యాధికార సమరభేరి‘ రావాలని మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులుకు పార్టీ నాయకులు ఆహ్వాన పత్రికను అందజేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క చిరంజీవులును మర్యాదపూర్వకంగా కలిసి సభకు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ పరిపాలనలో విశేష అనుభవం కలిగిన చిరంజీ వులు ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసి సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. పరిపాలనా రంగంలో ఆయన అందించిన సేవలు, సామాజిక అంశాలపై వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని కొనియాడారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రాజకీయ అధికారం దక్కాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ‘రాజ్యాధికార సమరభేరి‘ సభను విజయవంతం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జర్నలిస్ట్ సుదర్శన్‌గౌడ్, రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్‌రాజ్, రాష్ట్ర నాయకులు గిరగాని బిక్షపతిగౌడ్, అర్కటి శ్రీనిధి, రాజు తదితరులు పాల్గొన్నారు.