27 February, 2026 | 3:39 PM

ఉపాధి హామీ పనులపై కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్

27-02-2026 12:00 AM

సూర్యాపేట, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి) : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం వీబీ_ జీ రామ్ జీగా మారుస్తున్న తరుణంలో ఏం ఓ ఆర్ డీ (కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ) కేంద్ర బృందం సభ్యులు సంజయ్ కుమార్  నేతృత్వంలో గురువారం నుండి శనివారం వరకు సూర్యాపేట జిల్లాలో పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా జిల్లాలో జరిగిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం  పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బృంద సభ్యులకు వివరించారు. అనంతరం ఈజీఎస్ పథకాల పనులపై  జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ప్రదర్శనను కేంద్ర బృంద సభ్యులు తిలకించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె సీతారామారావు, డిప్యూటీ సీఈవో శిరీష, కేంద్ర బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.